ఒడిశాలో వివాహం చేసుకున్న ఓ హెచ్ఐవీ పాజిటివ్ జంటను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయన్ ఆశీర్వదించారు. గంజమ్ జిల్లాలోని గోపాల్పుర్లో శనివారం ఈ వేడుక జరిగింది.
హెచ్ఐవీ జంటను ఆశీర్వదించిన సీఎం
ఒడిశాలో ఇద్దరు హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తుల కల్యాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. గంజమ్ జిల్లా కలెక్టర్ వారికి దగ్గరుండి వివాహం జరిపించగా.. సీఎం నవీన్ పట్నాయక్ వర్చువల్గా దీవించారు.
సీఎం ఆశీస్సులతో పెళ్లి చేసుకున్న హెచ్ఐవీ జంట
హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న పద్మ, రవీంద్రల పెళ్లి.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని శ్రద్ధ సంజీవనీ సంస్థలో జరిగింది. వీరి వివాహానికి జిల్లా యంత్రాంగం మద్దతుగా నిలిచింది. గంజమ్ కలెక్టర్ విజయ్ అమృత్ కులంగే కన్యాదానం చేశారు. వర్చువల్ విధానంలో నవీన్ పట్నాయక్ వారికి ఆశీస్సులు అందజేశారు.
ఇదీ చూడండి:'రామ మందిరానికి రూ.2,100 కోట్ల విరాళాలు'
Last Updated : Feb 28, 2021, 9:14 AM IST