Student arrested for Hitech Copying in JEE Advanced Exam:నలుగురు కుర్రాళ్లు వాట్సాప్ గ్రూప్ పెట్టి మరీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ చేస్తూ దొరికిపోయిన ఘటన సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం నాడు(జూన్ 4న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన చింతపల్లి చైతన్య కృష్ణను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ సిటీలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజ్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు.. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి, సికింద్రాబాద్ కేంద్రాలలోజేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాశారు.
Hitech Copying in JEE Exam :పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాలేదో ఏమో మరీ.. ఈ నలుగురు కాపీయింగ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆ నలుగురే సభ్యులుగా ఉన్నారు. ఆదివారం ఉదయం పరీక్షకు వారు చాకచక్యంగా తమ తమ స్మార్ట్ ఫోన్లతో పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించారు. నలుగురిలోనూ తెలివైన విద్యార్థి. సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఎన్పీఐటీ కాలేజ్‌లో పరీక్ష రాసి, గణితం, రసాయన శాస్త్రానికి సంబంధించిన సమాధానాల స్క్రీన్ షాట్స్‌ను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు.
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో.. తెలుగు విద్యార్థుల సత్తా
- జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..