రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి పట్ల.. కాంగ్రెస్ సంతాపం తెలిపింది. రైతు ప్రయోజనాల కోసం ఆయన ఎనలేని పోరాటం చేశారని, ఆ సేవలు చిరస్మరణీయమని అభిప్రాయపడింది. ఈ క్లిష్ట సమయంలో అజిత్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సానుభూతిని ప్రకటించింది హస్తం పార్టీ.
ఆర్ఎల్డీ నాయకుడి మరణ వార్త.. చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు రాహుల్.
'సమాజానికి తీరని లోటు'
సింగ్ మృతిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.