అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసులో కారు యజమానిగా భావిస్తున్న మన్సుఖ్ హిరెన్ మృతి కేసు మరో మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో ఔరంగాబాద్ నుంచి దొంగిలించిన మారుతి ఎకో వాహనంలోనే హిరెన్ మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
ఆ కారులోనే హిరెన్ మృతి చెందాడా? - హిరెన్ హత్య కేసు
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కారు యజమాని మన్సుఖ్ హిరెన్ ఓ కారులో మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పోలీసు అధికారి సచిన్ వాజే నడిపినట్లు భావిస్తున్న మరో కారుతో ఈ కారు కనిపించినట్లు వెల్లడించాయి.
హిరెన్ హత్య కేసు
ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజ్ నడుపుతున్నట్లు అనుమానిస్తున్న మరో కారుతో మార్చి 4న ఈ కారు కనిపించిందని ఇంతకుముందు హిరెన్ హత్యకేసులో దర్యాప్తు జరిపిన మహారాష్ట్ర ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు. హిరెన్ మృతదేహం లభ్యం కావడానికి ఒక రోజు ముందు ఇది జరిగినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది.