తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిందుత్వానికి అర్థం చెప్పిన ఫడణవీస్‌ - హిందుత్వానికి అర్థం చెప్పిన ఫడణవీస్‌

మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ 'హిందుత్వం'పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌. 'హిందుత్వ అంటే ఓర్పు, సహనంతో కలిగి ఉండటమేనని' అన్నారు.

hindutva means tolerance says fadnavis
హిందుత్వానికి అర్థం చెప్పిన ఫడణవీస్‌

By

Published : Nov 21, 2020, 10:10 PM IST

Updated : Nov 21, 2020, 10:19 PM IST

కొవిడ్‌-19కి ముందే మతతత్వం, కఠినమైన జాతీయవాదం అనే రెండు మహమ్మారులకు బాధితురాలిగా సమాజం మారిందంటూ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. హిందుత్వం అనేది ఎప్పుడూ కఠినమైనది కాదన్నారు. ఎల్లప్పుడూ సహనాన్నే ప్రబోధిస్తుందని, ఇది భారతదేశ ప్రాచీన జీవనవిధానమని చెప్పారు.

హిందువులు ఎవరిపైనా, ఏ దేశంపైనా, ఏ రాష్ట్రం మీదా దాడులు చేయలేదన్నారు. హిందుత్వం ఎల్లప్పుడూ సహనాన్ని బోధించటం వల్లే భారతదేశంలో అనేక విశ్వాసాలు, కులాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు.

ఈ నెల 23 నుంచి మహారాష్ట్రలో 9 నుంచి 12 తరగతులకు పాఠశాలలు తెరిచే అంశంపై ఆయన స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవటం వల్ల కరోనా కేసులు పెరిగిన అనుభవాలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలని సూచించారు.

Last Updated : Nov 21, 2020, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details