హిందీ భాషను.. భారతీయ భాషలన్నింటికీ 'ఓ మంచి స్నేహితుడి'గా అభివర్ణించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah in Varanasi). మనం మాట్లాడే భాషల గొప్పదనంలోనే భారతదేశ ఔన్నత్యం దాగి ఉందని పేర్కొన్నారు. వారణాసిలో నిర్వహించిన అఖిల భారతీయ రాజ్యభాష సమ్మేళన్ అనే కార్యాక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత్లో ఉండే భాషలన్నింటికీ హిందీ భాష ఓ మంచి స్నేహితుడితో సమానం. గుజరాతీ కన్నా నాకు హిందీ భాష మీదే ప్రేమ ఎక్కువ. దేశ గొప్పదనం ప్రజలు మాట్లాడే భాషలోనే ఉంటుంది. ఆంగ్లంలో మాట్లాడలేని పిల్లలు ఆత్మన్యూనతాభావానికి లోను కావడం నేను చూశాను. అయితే నేను కచ్చితంగా చెప్పగలను.. అమ్మభాష మాట్లాడడం రాని వారు కూడా ఆత్మన్యూనతాభావానికి లోనయ్యే కాలం ఏంతో దూరంలో లేదు. భాషలను కాపాడుకోలేని మనం దేశాన్ని, సంస్కృతిని, సంప్రదాయ ఆలోచనలను కూడా పరిరక్షించుకోలేము. ప్రపంచ అభివృద్ధికి పాటు పడలేము. అందుకే మన మాతృభాషలను కాపాడుకుందాం."