తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మైనారిటీలూ.. కుటుంబ నియంత్రణ పాటించండి' - హిమంత బిశ్వ శర్మ కుటుంబ నియంత్రణ

జనాభా పెరుగుదల వల్ల పేదరికం పెరిగిపోతోందని.. కాబట్టి కుటుంబ నియంత్రణ పాటించాలని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మైనారిటీ ప్రజలను కోరారు. మహిళలకు ఈ మేరకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.

himanta-urges-minority-community-to-adopt-decent-family-planning-policy-for-poverty-reduction
అసోం సీఎం హిమంత బిశ్వ

By

Published : Jun 10, 2021, 4:08 PM IST

జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ విధానాన్ని పాటించాలని మైనారిటీలను కోరారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 రోజులైన సందర్భంగా మాట్లాడిన ఆయన... అధిక జనాభా వల్ల పేదరికం పెరిగిపోతోందని అన్నారు. పేదరికాన్ని తగ్గించేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మైనారిటీ వర్గాల మహిళలకు ఈ మేరకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. తద్వారా ఈ సమస్యను ఎదుర్కోవచ్చని అన్నారు.

"పేద ప్రజలందరి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. కానీ జనాభా వృద్ధి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి మైనారిటీల మద్దతు కావాలి. పేదరికం, నిరక్షరాస్యతకు అధిక జనాభా మూల కారణం."

-హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం

ఈ సందర్భంగా తమ పార్టీ నేతలకు సైతం సీఎం దిశానిర్దేశం చేశారు. జనాభా నియంత్రణను పాటించే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు.

ఇదీ చదవండి:US: భారతీయ అమెరికన్లలో వివక్ష భావన!

ABOUT THE AUTHOR

...view details