అసోం సీఎం ఎవరు?.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం. ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రమాణ స్వీకారం శుక్రవారం ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వెల్లడించినా.. సీఎం ఎవరనే విషయంలో స్పష్టత లేని కారణంగా వాయిదా పడింది.
126 స్థానాలు కలిగిన అసోం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని భాజపా 60 స్థానాలు, ఏజీపీ 9, యూపీపీఎల్ ఆరు సీట్లు గెలుపొందాయి. ఫలితాలు వెలువడి వారం రోజులకుపైగా గడుస్తున్నప్పటికీ సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
కీలక నేతల మధ్య గట్టి పోటీ?
అసోం ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని మిత్రజోన్ కూటమి ఘన విజయ సాధించింది. అయితే.. ముఖ్యమంత్రి పదవి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎం శర్బానంద సోనోవాల్, పార్టీ కీలక నేత హిమంత బిశ్వశర్మ మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యమంత్రిగా శర్బానంద పేరును అధిష్టానం ప్రకటించకపోయినప్పటికీ.. పార్టీ విజయం సాధించటంలో కీలకంగా వ్యవహరించినట్లు అధిష్ఠానం భావిస్తోంది. మరోవైపు.. ఈశాన్య రాష్ట్రాల ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్ హోదాలో ఈ ప్రాంతంలో సంక్షోభ పరిష్కర్తగా హిమంత బిశ్వశర్మకు మంచి పేరు ఉంది. ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆయనపై మంచి అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఇద్దరి నేతల్లో ఎవరి పేరును ఖరారు చేస్తారోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
దిల్లీ చేరిన రాజకీయాలు..