అసోం సీఎంగా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్న హిమంత బిశ్వ శర్మ.. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖిని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు తనకు ఉందని లేఖ అదించారు. అనంతరం హిమంతను అసోం ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసినట్లు భాజపా నేతలు తెలిపారు.
అసోం గవర్నర్ను కలిసిన హిమంత - అసోం సీఎం
19:05 May 09
15:42 May 09
అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణం చేయనున్నారు. నూతన కేబినెట్ మంత్రులు కూడా సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో హిమంతను భాజపా శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ నేతలు ఎన్నుకున్నారు.
10:31 May 09
అసోం గవర్నర్ను కలిసిన హిమంత
అసోం రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పీఠం హిమంత బిశ్వను వరించింది. ఆయన సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది.
తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు గువాహటిలో సమావేశం ఏర్పాటు చేసింది పార్టీ. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కచ్చితంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో.. మాజీ సీఎం సర్బానంద సొనోవాల్.. హిమంతను ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. ఇందుకు పార్టీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ మద్దతిస్తారని సమాచారం.
మరోవైపు సొనోవాల్.. తన రాజీనామాను గవర్నర్ జగ్దీశ్ ముఖికి సమర్పించారు.
ఎన్నికల అనంతరం...
అసోం ఎన్నికల్లో భాజపా కూటమి ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టింది. అయితే దాదాపు వారం రోజులు పాటు.. సీఎం కుర్చీపై సందిగ్ధత నెలకొంది. సర్బానంద సొనోవాల్.. హిమంత మధ్య సీఎం పీఠానికి తీవ్రస్థాయిలో పోటీ నడిచింది.
ఈ నేపథ్యంలో శనివారం ఇద్దరు దిల్లీకి వెళ్లి.. భాజపా ఆగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాని కలిశారు. ఈ భేటీలోనే హిమంత సీఎం చేయాలని భాజపా పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.