తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేడకుప్పలో రక్తమోడుతూ.. నవజాత శిశువు - girl raped and became pregnant news in himachal

అత్యాచారానికి గురై గర్భవతిగా మారిన ఓ బాలిక తనకు పుట్టిన నవజాత శిశువును పేడకుప్పలో వదిలేసి వెళ్లింది. ఈ అమానవీయ ఘటన హిమాచల్​ప్రదేశ్​లో జరిగింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ శిశువుని స్థానికుడు ఒకరు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

baby in heap of dung
పేడకుప్పలో శిశువు

By

Published : Jun 24, 2021, 4:18 PM IST

Updated : Jun 24, 2021, 7:47 PM IST

హిమాచల్​ ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. నవజాత శిశువును పేడలో పడేసి వెళ్లిపోయింది ఓ తల్లి. సిర్​మౌర్​ జిల్లా​ రోహ్​నత్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో చిన్నారి తల్లైన ఓ బాలికను, 12వ తరగతి చదివే మరో విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం తరలించారు.

'భయంతో వదిలించుకున్న..'

తనపై తన బావ అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు బాలిక తెలిపింది. దాంతో తాను గర్భవతిని అయ్యానని చెప్పింది. సమాజం ఏమనుకుంటోందనన్న భయంతో తనకు పుట్టిన పాపను.. ఆవు పేడతో నిండి ఉన్న గొయ్యిలో పడేసి, బండరాయిని పెట్టానని చెప్పింది.

చిన్నారి ఏడుపులు విన్న ఓ స్థానికుడు.. ఆవు పేడలో రక్తంతో ఉన్న పాపను బయటకు తీశాడు. ఆ నవజాత శిశువును నహాన్​ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు. డిశ్చార్జి అనంతరం పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగిస్తామని చెప్పారు.

సదరు బాలిక, తన బావపై కేసు నమోదు చేశామని పోంటా సాహిబ్​ డీఎస్​పీ బీర్​ బహదూర్​ తెలిపారు.

ఇదీ చూడండి:మరుగుదొడ్ల వ్యర్థాలు కలిసిన నీళ్లు తాగి.. ఇద్దరు మృతి!

ఇదీ చూడండి:ఐసీయూలో ఎలుక కరచిన రోగి మృతి

Last Updated : Jun 24, 2021, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details