ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ఆ సమాచారాన్ని లొకేషన్‌తో సహా కుటుంబ సభ్యులకు చేరవేసేలా రిధిమా ఠాకుర్ అనే పదో తరగతి విద్యార్థిని స్మార్ట్ హెల్మెట్‌ను రూపొందించింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిధిమా, తాను రూపొందించిన స్మార్ట్ హెల్మెట్‌ను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శనకు ఉంచింది. హెల్మెట్‌ను ధరించడం మర్చిపోయినా, సరిగ్గా ధరించకపోయినా బీప్ శబ్దంతో ఇది అప్రమత్తం చేస్తుంది. ఇందులో కెమెరా, లొకేషన్ ట్రాకర్, సెన్సర్లు, ట్రాన్స్మిటర్, రిసీవర్ వ్యవస్థలు, జీఎస్ఎం సిమ్‌ను అమర్చుకునే వెసులుబాటు ఉన్నాయి.
హెల్మెట్‌కు సీసీటీవీ కెమెరా.. కిందపడితే వెంటనే ఇంటికి మెసేజ్.. ఇంకెన్నో ఫీచర్లు
ఇటీవల తరచూ హిట్ అండ్ రన్ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థిని అద్భుత ఆలోచన చేసింది. బైక్‌పై వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆ సమాచారాన్ని లొకేషన్‌తో సహా కుటుంబ సభ్యులకు చేరవేసేలా స్మార్ట్ హెల్మెట్‌ను రూపొందించింది. ఆ హెల్మెట్ ఇంకా ఏమేం చేస్తుందంటే?
ఏదైనా ప్రమాదం జరిగి హెల్మెట్ కిందపడితే లేదా దేన్నైనా ఢీకొంటే, వెంటనే అందులోని ప్రెజర్ ప్లేట్ టెక్నిక్ సాయంతో, ముందే సేవ్ చేసుకున్న ఫోన్ నంబర్లకు కాల్ లేదా మెసేజ్ వెళ్తుంది. ఎవరైనా అనుమానితులు అనుసరిస్తున్నా లేదా ప్రమాదం పొంచి ఉన్నా హెల్మెట్‌లోని ఓ బటన్‌ను నొక్కడం ద్వారా అత్యవసర నంబర్లకు ఫోన్ చేయొచ్చు. లైవ్ లొకేషన్ షేర్ చేయొచ్చు. ఇందులోని కెమెరా సీసీటీవీలా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి రూ.8 వేల వరకూ ఖర్చయినట్లు రిధిమా తెలిపింది. ఇటీవల హిట్ అండ్ రన్ కేసులు అధికంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి హెల్మెట్‌ను ధరించడం వల్ల ద్విచక్రవాహనదారులకు ఉపయోగం ఉంటుందని రిధిమా చెబుతోంది.