Himachal pradesh fire incident: హిమాచల్ ప్రదేశ్ కుల్లూ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మజాణ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. 26 పశువుల పాకలు కూడా కాలి బూడిద అయ్యాయి. దాదాపు 9 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలిపారు.
ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జనం భయంతో పరుగులు పెట్టినట్లు వెల్లడించారు. ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.