Himachal Pradesh Elections Date : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఒకే దశలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితం వెలువడనుంది.
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 17
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 25
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29
- పోలింగ్ తేదీ: నవంబర్ 12
- ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబర్ 8
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భాజపా అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తి కానుంది. హిమాచల్‌లో 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. 55 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 43 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆమ్ఆద్మీ పార్టీ.. హిమాచల్ ప్రదేశ్‌లోనూ బరిలోకి దిగనుంది.
గుజరాత్ సంగతేంటో?
గుజరాత్ శాసనసభ ఎన్నికల తేదీల్నీ శుక్రవారమే ఈసీ ప్రకటిస్తుందని తొలుత అంతా భావించారు. అయితే.. హిమాచల్ ప్రదేశ్‌కే పరిమితమైంది ఎన్నికల సంఘం. గుజరాత్ అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి 18 వరకు ఉంది.