Himachal Pradesh Election 2022 : హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం ఆ రాష్ట్రంలోని 68 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.
- మొత్తం ఓటర్లు- 55,07,261
- పురుష ఓటర్లు- 27,80,208
- మహిళా ఓటర్లు- 22,27,016
- తొలిసారి ఓటువేయబోయే యువ ఓటర్లు- 1,86,681
- పోలింగ్ కేంద్రాలు- 7,881
- పోలింగ్ తేదీ- నవంబరు 12
- ఓట్ల లెక్కింపు తేదీ-డిసెంబరు 8
మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో పూర్తికానుంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 43, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకున్నాయి.
రాష్ట్రంలో రెండో సారి వరుసగా అధికారంలోకి రావాలని భాజపా తహతహలాడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఆమ్ఆద్మీ పార్టీ అదృష్టం పరీక్షించుకుంటోంది.