తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అర్హులందరికీ తొలి డోసు పూర్తి.. ఆ రాష్ట్రానికి మోదీ అభినందన - హిమాచల్ ప్రదేశ్ టీకా

దేశంలో రోజుకు కోటి పాతిక లక్షల టీకా డోసులు పంపిణీ చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వ్యాక్సినేషన్​లో హిమాచల్ ప్రదేశ్ మెరుగ్గా రాణిస్తోందని అన్నారు. లబ్ధిదారులందరికీ తొలి డోసు పూర్తి చేసిందని చెప్పారు.

pm modi
నరేంద్ర మోదీ

By

Published : Sep 6, 2021, 1:22 PM IST

భారత్ ప్రతి రోజు 1.25 కోట్ల కొవిడ్ టీకాలను(india vaccination) పంపిణీ చేస్తోందని, ఇది ప్రపంచంలోని చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హిమాచల్​ప్రదేశ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో దిల్లీ నుంచి వర్చువల్​గా పాల్గొన్న ఆయన(pm modi).. అక్కడి వైద్య కార్యకర్తలు, లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులందరికీ టీకాలు (covid vaccines) అందించిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందని (100 percent vaccinated state in india).. రవాణా సమస్యలు ఉన్నా ఈ ఘనత సాధించిందని మోదీ (modi news today) కొనియాడారు.

వర్చువల్ కార్యక్రమంలో మోదీ

"గర్వంగా భావించే అవకాశాన్ని నాకు హిమాచల్​ప్రదేశ్ ఇచ్చింది. కొండ ప్రాంతమైన ఈ రాష్ట్రం కనీస అవసరాల కోసం ఇబ్బందులు పడటం నేను చూశా. కానీ, ఇప్పుడు మెరుగైంది. అర్హులైన లబ్ధిదారుల్లో 100 శాతం మందికి తొలిడోసు టీకా ఇచ్చిన రాష్ట్రంగా అవతరించింది. మూడో వంతు జనాభాకు రెండు డోసులు అందించింది. సిక్కిం, దాద్రా నగర్ హవేలీ కూడా తొలిడోసు విషయంలో 100 శాతం లక్ష్యాన్ని సాధించాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

వారితో ముచ్చట

ఈ సందర్భంగా పలువురితో మోదీ (modi interaction) ముచ్చటించారు. శిమ్లా జిల్లాకు చెందిన వైద్యుడు రాహుల్​తో మాట్లాడిన ప్రధాని.. టీకా వయల్స్​ను పూర్తిగా వినియోగించుకుంటే 10 శాతం ఖర్చు ఆదా చేసినట్లేనని చెప్పారు. కాలు దెబ్బతిన్నప్పటికీ ప్రజలకు టీకాలు వేస్తున్న హెల్త్ వర్కర్ కర్మో దేవిని అభినందించారు. ఇప్పటివరకు 22,500 టీకాలను లబ్ధిదారులకు అందించినట్లు మోదీకి కర్మో దేవి వివరించారు.

వైద్యులతో మాట్లాడుతున్న ప్రధాని

పర్యటకంపై..

మరోవైపు, అటల్ టన్నెల్ (atal tunnel) ద్వారా పర్యటకానికి ఉత్తేజం లభించిందని నవాంగ్ ఉపాశక్ అనే వ్యక్తి మోదీతో చెప్పారు. దీనిపై స్పందించిన మోదీ.. కొవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న యువత హిమాచల్​ప్రదేశ్​ను తమ పర్యటక ప్రాంతంగా (himachal pradesh tourism) ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details