Hijab row: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ఓ అమృతధారి (బాప్టిజం తీసుకున్న) సిక్కు బాలికను తలపాగా తొలగించాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
హిజాబ్ వివాదంపై విచారణలో భాగంగా.. తుది తీర్పు వెలువరించే వరకు తరగతి గదుల్లో విద్యార్థులు.. శాలువాలు, హిజాబ్‌లు, స్కార్ఫ్‌లు, మతపరమైన జెండాలను ధరించరాదని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దీని గురించి ఫిబ్రవరి 16న కళాశాలను తెరిచిననాడే విద్యార్థులకు సమాచారం అందించినట్లు కళాశాల అధికారులు తెలిపారు.
సిక్కు బాలికకూ ఇలా..
ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ సదరు కళాశాలను సందర్శించిన సందర్భంగా.. కొందరు బాలికలు హిజాబ్ ధరించడాన్ని గమనించారు. వారికి కోర్టు ఆదేశాల గురించి వివరించి, దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ఈ తీర్పు సిక్కులకూ వర్తింపజేయాలని ఆ బాలికలు డిమాండ్ చేశారు.
దీంతో సిక్కు బాలిక తండ్రితో మాట్లాడిన కళాశాల యాజమాన్యం.. కోర్టు తీర్పు గురించి చెప్పి, దానిని పాటించాలని పేర్కొంది. అయితే బాలిక తలపాగా తొలగించదని ఆమె కుటుంబసభ్యులు బదులిచ్చినట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వుల్లో సిక్కు తలపాగా గురించి ప్రస్తావన లేదని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇదీ వివాదం..