Hijab Row: హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది ఓ విద్యార్థిని. హైకోర్టు తీర్పు.. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పిటిషన్లో పేర్కొంది. హైకోర్టు తీర్పుతో పాటు త్రిసభ్య ధర్మాసనం ముందు జరుగుతున్న విచారణపై స్టే విధించాలని సుప్రీం కోర్టును కోరింది.
అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సరైన సమయంలో ఈ కేసును విచారణకు అనుమతిస్తామని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. కర్ణాటకతోపాటు ఆ రాష్ట్ర హైకోర్టులో ఏం జరుగుతుందో గమనిస్తున్నామన్న ధర్మాసనం... హిజాబ్ అంశంపై సరైన సమయంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. దీన్ని దేశవ్యాప్త సమస్యగా మార్చవద్దని న్యాయవాదులకు సుప్రీంకోర్టు సూచించింది.
హైకోర్టు తీర్పు
ఈ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ ఖాజీ జైబున్నీసా మొహిద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. తుది తీర్పు వెల్లడించే వరకు ఎవరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి విద్యా సంస్థలకు రాకూడదని మౌఖిక తీర్పు వెలువరించింది హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దేవదత్ కామత్, సంజయ్ హెగ్డేల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇలా మొదలైంది హిజాబ్ వివాదం