Hijab row: సోమవారం నుంచి ఫిబ్రవరి 19 వరకు కర్ణాటక ఉడుపిలోని అన్ని ఉన్నత పాఠశాలల వద్ద సెక్షన్ 144 విధించింది ఆ జిల్లా యంత్రాంగం. హిజాబ్ వివాదం కారణంగా మూతబడిన స్కూల్స్‌ను ఫిబ్రవరి 14న తెరవనున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.
School Reopening in Karnataka: పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో శాంతి, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలను తెరవడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
"పదో తరగతి వరకు బడులు సోమవారం తెరుచుకుంటాయి. శాంతియుత వాతావరణం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశాలు ఇచ్చాము. పాఠశాలలు ప్రశాంతంగా నడుస్తాయనే నమ్మకంతో ఉన్నా"
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి
అంతకుముందు డిగ్రీ, డిప్లొమా కళాశాలలు ఫిబ్రవరి 16 వరకు మూసే ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హిజాబ్ వివాదంలో విదేశీ శక్తుల పాత్రపై మీడియాలో వస్తున్న కథనాలను తమ దర్యాప్తు అధికారులు పరిగణనలోకి తీసుకుంటారని బొమ్మై వెల్లడించారు.
హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని పాఠశాలలకు ఫిబ్రవరి 9న మూడు రోజుల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14 నుంచి పదో తరగతి వరకు పాఠశాలలను తెరవాలని ఫిబ్రవరి 10న నిర్ణయించింది.
కోర్టు మధ్యంతర తీర్పు..