Hight of Men In Bettiah District: బిహార్, బేతియా జిల్లాలోని మర్హియా గ్రామం.. దేశంలో ఓ ప్రత్యేకతను చాటుతోంది. అక్కడ వ్యక్తుల ఎత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామంలో మగవారి ఎత్తు సాధారణంగా 6 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆడవారి ఎత్తు 5 అడుగుల 10 అంగుళాల వరకు ఉంటుంది. ఆడవారికి వరుడు దొరకడం కష్టంగా మారింది.. కానీ మగవారికి మాత్రం వారి ఎత్తు వరంగా మారింది. గ్రామంలో యువకులంతా సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్నారు.
'గ్రామంలో 75 శాతం మంది ప్రజలు 6 అడుగుల ఎత్తు ఉంటారు. ప్రతి ఒక్కరు సైన్యంలో చేరాలని కోరుకుంటున్నారు. మా ఎత్తు అందుకు ఉపయోగపడుతోంది. గ్రామంలో మొత్తం 120 మంది యువకులు ఉన్నారు. అందరూ ప్రతి రోజు ఉదయం 4 గంటలకు లేచి సైన్యంలో చేరడానికి కావాల్సిన కసరత్తులు చేస్తుంటారు. గ్రామంలో మొత్తం 1400 మంది నివసిస్తున్నారు. ఇందులో రాజపుత్రులు కూడా ఉన్నారు.' అని సిద్దాంత్ కుమార్ సింగ్ తెలిపారు.