దేశంలోనే కాదు విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే గోవా.. తాజాగా కరోనా విజృంభణతో వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ కొవిడ్ పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ తేలడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొవిడ్ కట్టడి ఆంక్షలు అమలు చేస్తోంది.
గోవాలో ఏప్రిల్ నెలలో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. గత నెలలో అక్కడ పాజిటివిటీ 40 నుంచి 51శాతంగా ఉన్నట్లు అక్కడి కొవిడ్ నిర్వహణ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు 48శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే గోవా అగ్రస్థానంలో ఉండగా.. 37శాతం పాజిటివిటీ రేటుతో హరియాణా రెండోస్థానంలో ఉంది.
గోవాలో కొవిడ్ పరీక్షలు జరిపిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం చూస్తుంటే వైరస్ ఎంత విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతుందో స్పష్టంగా అర్థమవుతోందని ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే పూర్తి లాక్‌డౌన్‌తో పాటు కొంతకాలం పర్యాటకులు రాకుండా నిషేధం విధించడమే ఏకైక మార్గమని అభిప్రాయపడుతున్నారు.
లాక్‌డౌన్ ఒక్కటే మార్గం..