Hyatt hotel sex racket: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లోని 4-స్టార్ హోటల్లో హై-ప్రొఫైల్ సెక్స్ రాకెట్ బయటపడింది. తేలిబాంధా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 'హోటల్ హయాత్'పై దాడులు చేసిన పోలీసులు.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. పలువురు యువతులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో గుజరాత్, హరియాణా రాష్ట్రాలతో పాటు, దిల్లీ, ముంబయి, బెంగళూరుకు చెందిన యువతులు ఉన్నారు. నేపాల్‌కు చెందినవారినీ అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారాన్ని నడిపిస్తున్న ఓ బ్రోకర్‌ను సైతం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
రాష్ట్రానికి చెందిన బడాబాబులతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టైన యువతుల ఫోన్లలో నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అందులో ప్రముఖుల మొబైల్ నెంబర్లు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. రాజకీయ నాయకుల పేర్లు, కాంటాక్ట్ నెంబర్లు సైతం ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే, ఎవరి పేరునూ పోలీసులు వెల్లడించలేదు.