Ludhiana Court Blast: పంజాబ్‌లో లూథియానా జిల్లా కోర్టుల కాంప్లెక్స్‌లో నిందితులు ఐఈడీతో పేలుడుకుపాల్పడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పేలుళ్లు జరిగే అవకాశముందని ముందుగానే మూడుసార్లు పంజాబ్ పోలీసులను హెచ్చరించినట్లు వెల్లడించాయి. సున్నిత ప్రదేశాలు, కీలక భవనాలు, రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా దాడిచేస్తారని ముందే అప్రమత్తం చేసినట్లు..నిఘావర్గాలు తెలిపాయి.
జులై 9, డిసెంబర్ 7న, లూథియానాలో పేలుళ్ల జరిగిన డిసెంబరు 23న కూడా..పంజాబ్ పోలీసులను హెచ్చరించినట్లు.. నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ ఐఎస్‌ఐ, ఖలిస్థాన్ సంస్థల కుట్రపైనా హెచ్చరించినట్లు వెల్లడించాయి.లష్కరే తొయిబా ఉగ్రవాదులు చొరబడే ముప్పుందని ఈనెల 9న పంజాబ్ పోలీసులకు సమాచార మిచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు వివరించాయి. లూథియానా జిల్లా కోర్టుల సముదాయంలో గురువారం పేలుడు జరిగి ఒకరు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తికి పేలుడుకు పాల్పడిన వారితో సంబంధం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు లుథియానా కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లర్. మధ్యాహ్నం 12.22 గంటలకు ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారని పేర్కొన్నారు.
'ఇది కుట్ర'