Tollywood Actor Dimple Hayati Case Update : హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టిన కేసును కొట్టివేయాలని నటి డింపుల్ హయాతి హైకోర్టులో పిటిషన్ చేసింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అధికార ఒత్తిడితో తనపై తప్పుడు కేసు పెట్టారని డింపుల్ హయాతి వాదన. తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. కేసు విచారణ జరుగుతోందని డింపుల్ హయాతికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసు కూడా ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇదే కేసులో నిందితుడుగా ఉన్న న్యాయవాదికి విక్టర్ డేవిడ్‌కు కూడా 41ఏ నోటీసు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు తెలిపింది. సీఆర్‌పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులకు స్పష్టం చేసింది. పోలీసుల నోటీసులకు స్పందించి విచారణకు హాజరు కావాలని డింపుల్‌ను హైకోర్టు ఆదేశించింది.
Actress Dimple Hayati Case : హైకోర్టులో నటి డింపుల్ హయాతి పిటిషన్.. న్యాయస్థానం ఏం చెప్పిందంటే...
19:46 June 07
Actress Dimple Hayathi Controversy : నటి డింపుల్ హయాతి కేసులో.. సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలు దాటవద్దు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. సీఆర్‌పీసీ 41 ఏ : అయితే ఈ కేసులో పోలీసులు డింపుల్ హయాతికి సీఆర్‌పీసీ 41 ఏ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ స్పందిస్తూ.. డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. సినీ నటి డింపుల్ హయాతితో డీసీపీ చాలాసార్లు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. ఒక డీసీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మహిళతో ఇలానే నడుచుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై డింపుల్ కూడా పోలీస్ స్టేషన్‌లో కేసు వేసింది. ఆ తర్వాత తనపై కావాలనే కేసు పెట్టారని.. వెంటనే రద్దు చేయాలని ఆమె హైకోర్టుకు వెళ్లింది. తాజాగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అసలే జరిగిందంటే.. : జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో నటి డింపుల్ హయాతి నివాసం ఉంటున్నారు. అదే అపార్టుమెంట్‌లో హైదరాబాద్ నగర ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కుటుంబంతో ఉన్నారు. డీసీపీ తనకు చెందిన ప్రభుత్వ వాహనాన్ని అపార్టుమెంట్‌లోని సెల్లార్‌లో పార్కింగ్ చేశారు. ఆ వాహనం పక్కనే డింపుల్, డేవిడ్‌లు తమ కార్లను పార్కింగ్ చేస్తారు. ఈ క్రమంలో డింపుల్ హయాతి తన కారును కప్పి ఉంచే కవర్‌ను తొలగించడం.. అడ్డుగా ఆమె వాహనాన్ని ఉంచడం చేస్తోందని డీసీపీ ఆరోపిస్తున్నారు.
Actress Dimple Hayati case in hyderabad : తనను ఎంతగా రిక్వెస్ట్ చేసిన అదేవిధంగా చేస్తున్నారని చెప్పుకోచ్చారు. మే 14వ తేదీన హయాతి కారుతో తన వాహనాన్ని ఢీ కొట్టిందని.. దీంతో తన వాహనం ముందు భాగం దెబ్బతిన్నదని డీసీపీ రాహుల్ హెగ్డే వివరించారు. ఈ మేరకు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించిన డ్రైవర్ చేతన్ కుమార్.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు హయాతి ట్విటర్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. తాను తప్పును కప్పి పుచ్చినట్లు ట్వీట్ చేశారని డీసీపీ తెలిపారు. ఆమె చేస్తున్న ఆరోపణలపై నిజాలు బయటపడతాయని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :