TS High Court stays NTR statue in Khammam : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును సవాల్ చేస్తూ ఆదిభట్ల శ్రీకళాపీఠం, భారత యాదవ సమితి వేసిన లంచ్ మోషన్‌పై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ షావిలి విచారణ జరిపారు. ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరం లేదు కాని.. శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం వల్ల హిందువులు ముఖ్యంగా యాదవుల మనోభావాలు దెబ్బతీస్తాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయవద్దన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు కూడా విరుద్ధమన్నారు.
Telangana High Court : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే - టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు
18:06 May 18
Telangana High Court : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు : ఈనెల 28న విగ్రహ ఏర్పాటు చేయవద్దని ఆదేశాలని ఇవ్వాలని హైకోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కమిటీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఖమ్మం లక్కారం చెరువులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కృష్ణావతార విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు నిర్ణయించారు. ఎన్టీఆర్ వందో జయంతి సందర్భంగా మే 28న విగ్రహం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహాన్ని రూ.2.3 కోట్లతో నిజామాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లక్కారం చెరువు మధ్యలో తీగల వంతెన వద్ద ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు హైకోర్టు విధించిన స్టేతో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన నిలిచిపోనుంది.
ఇవీ చదవండి: