తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైకోర్టు విచారణ యూట్యూబ్​లో లైవ్​- చరిత్రలోనే తొలిసారి! - కర్ణాటక హైకోర్టు

నాలుగు గోడల మధ్య జరిపే కేసు విచారణను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేసింది కర్ణాటక హైకోర్టు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా.. యూట్యూబ్​లో లైవ్​ స్ట్రీమింగ్​ నిర్వహించింది. ఇలా జరగడం న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారి.

High Court session live in YouTube
హైకోర్టు విచారణ యూట్యూబ్​లో లైవ్

By

Published : Jun 1, 2021, 10:09 AM IST

Updated : Jun 1, 2021, 10:30 AM IST

న్యాయచరిత్రలోనే తొలిసారిగా ఓ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసింది కోర్టు. కర్ణాటక హైకోర్టు ఓ కేసు వాదనలను యూట్యూబ్​లో లైవ్​ స్ట్రీమింగ్​ చేసింది. అత్యున్నత న్యాయస్థానాల్లో జరిగే కేసులకు సంబంధించి విచారణలు.. సామాన్య ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

కేసు విచారణలను.. ప్రజలు వీక్షించేందుకు ఆన్​లైన్​ కోర్టు రూంలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్​ ఎప్పటినుంచో ఉంది. ఇటీవలే.. సుప్రీం కోర్టు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ-కోర్టు సెషన్ల నిర్వహణకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఉత్తర కన్నడ మత్స్యకారుల సంఘాలు దాఖలు చేసిన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించిన కేసు విచారణ జరిపి ఇప్పుడు అమలు చేసింది హైకోర్టు ధర్మాసనం.

రానున్న రోజుల్లో విచారణకు సంబంధించి.. మరిన్ని లైవ్​ స్ట్రీమింగ్​లు చూడొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:'కోర్టునే మోసం చేయాలని చూస్తారా?'

Last Updated : Jun 1, 2021, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details