High Court Comments on Govt keeping GOs Secret: జీవోలను మీరు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు..? అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? అంటూ జీవోల గోప్యతపై హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ జీవోల గోప్యతపై హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ జరపాలని న్యాయవాదులు ఉమేష్ చంద్ర, అంబటి సుధాకర్, యలమంజుల బాలాజీ, శ్రీకాంత్‌లు సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 2021లో వేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ జరగుతుందని న్యాయమూర్తి దృష్టికి న్యాయవాదులు తీసుకొచ్చారు. డెబ్బై శాతం జీవోలను వెబ్ సైట్లో ఉంచటం లేదని న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు. జీవోల ద్వారా హక్కులు సంక్రమిస్తాయి.. ఆ హక్కులను మీరెలా కాలరాస్తారు అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. జీవోలను వెబ్ సైట్లో ఉంచటంపై తాను పూర్తి వివరాలు అందిస్తానని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషన్‌పై విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరటంతో.. వచ్చే బుధవారం విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది.
జీవోలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ? అంత అవసరమేంటి ?: ఏపీ హైకోర్టు - Hearing in High Court on petition against Govt
![జీవోలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ? అంత అవసరమేంటి ?: ఏపీ హైకోర్టు high_court_comments_on_govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-11-2023/1200-675-20032498-thumbnail-16x9-high-court-on-govt-gos.jpg)
high_court_comments_on_govt
Published : Nov 15, 2023, 8:21 PM IST
|Updated : Nov 15, 2023, 8:42 PM IST
20:15 November 15
ప్రభుత్వ జీవోల గోప్యతపై వచ్చే బుధవారం విచారణ
Last Updated : Nov 15, 2023, 8:42 PM IST