తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid: బాధితుల్లో చర్మ వ్యాధులు అధికం! - కొవిడ్​ చర్మ వ్యాధులు

కొవిడ్​ నుంచి కోలుకుంటున్న వారిలో చర్మ వ్యాధుల సమస్య ఎక్కువగా ఉందని దిల్లీ వైద్యులు వెల్లడించారు. జుట్టు రాలడం, కింది పెదవిపై దురదతో కూడిన మంట, చర్మంపై బొబ్బలు, ఎర్రని దుద్దుర్లు, నుదుటిపై నల్లని మచ్చలు వంటి లక్షణాలు గుర్తించినట్లు చెప్పారు.

skin problems in covid patients, కొవిడ్​ చర్మ వ్యాధులు
కొవిడ్​ నుంచి కోలుకున్నవారికి మరో సమస్య!

By

Published : Jun 7, 2021, 1:01 PM IST

‍‌కరోనా నుంచి కోలుకుంటున్న దశలో చర్మ వ్యాధుల సమస్య బాధితుల్లో అధికంగా ఉందని దిల్లీ వైద్యులు తెలిపారు. అప్పటికే వారిలో చర్మవాధులు ఉండి.. తగ్గి ఉంటే అలాంటి వారిలో ఈ వ్యాధులు తిరగబడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వైరస్‌ల వల్ల వచ్చే హెర్ప్స్‌ వంటి చర్మ వ్యాధులను కోలుకుంటున్న రోగుల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు.

జుట్టు రాలడం, కింది పెదవిపై దురదతో కూడిన మంట, చర్మంపై బొబ్బలు, ఎర్రని దుద్దుర్లు, నుదుటిపై నల్లని మచ్చలు వంటి లక్షణాలు గుర్తించినట్లు చెప్పారు. మహిళల్లో జుట్టు రాలే సమస్య అధికంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో ఇలాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రందించాలని దిల్లీ వైద్యులు సూచించారు.

ఇదీ చదవండి :కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!

ABOUT THE AUTHOR

...view details