తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెన్నై విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టివేత - చెన్నై విమానాశ్రయంలో హెరాయిన్ అక్రమ రవాణా

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.70 కోట్ల విలువైన హెరాయిన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్​ నుంచి చెన్నై చేరుకున్న ఇద్దరు ఆఫ్రికన్ మహిళల వద్ద ఈ హెరాయిన్​ లభించినట్లు తెలిపారు.

Heroin
మహిళ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్

By

Published : Jun 4, 2021, 8:54 PM IST

తమిళనాడులో 70కోట్లు విలువైన హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఆఫ్రికన్‌ మహిళల నుంచి 9.87 కేజీలు హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో అప్రమత్తమైన కస్టమ్స్‌ అధికారులు.. విమానాశ్రయ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

సూట్​కేసులో దాచిన హెరాయిన్​ను చూపిస్తున్న సిబ్బంది
సూట్​కేసు అడుగు భాగంలో దాచిన హెరాయిన్
మహిళ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్

ఈ క్రమంలో ఆఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌ నుంచి వచ్చిన.. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు వారి వద్ద పెద్ద మెుత్తంలో మాదకద్రవ్యాలను గుర్తించారు. ఇద్దరు ఆఫ్రికన్‌ మహిళలపై కేసు నమోదు చేసిన అధికారులు.. హెరాయిన్‌ను సీజ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details