Heroin seized in Gujarat: గుజరాత్లో మరోమారు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 260 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని తెలిపారు. కచ్ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా ఓ కంటెయినర్లో భారీగా డ్రగ్స్ వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు.
రూ.1300 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత - హెరాయిన్
22:29 April 21
గుజరాత్లో రూ.1300 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత
ముంద్రా పోర్టులో రెండు కంటెయినర్లలో రూ.21వేల కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్ పట్టుకున్న కొన్ని నెలల్లోనే భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం గమనార్హం. 2021 సెప్టెంబర్‌లో ముంద్రా పోర్టులో డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
" ఏటీఎస్‌కు విశ్వసనీయవర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. డీఆర్ఐతో కలిసి కుండ్లా పోర్ట్‌లోని కంటెయినర్ స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. కిలోకి రూ.5 కోట్లు విలువైన హెరాయిన్ మొత్తం 260 కిలోలు లభించింది. కంటెయినర్ లోపల దాచి తరలిస్తుండగా పట్టుకున్నాం."
- సీనియర్ అధికారి.
ఇదీ చూడండి:అడవిలో అర్ధనగ్నంగా బాలిక మృతదేహం.. గ్యాంగ్‌రేప్‌ల కలకలం!