Heroin Seized: కోల్‌కతా విమానాశ్రయంలో రూ.113 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేశారు అధికారులు. డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలు సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు. 16.5 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో ఏయిర్‌పోర్టులో అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో కెన్యా నుంచి వస్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని, హవాయి నుంచి వస్తున్న మరో మహిళను అడ్డగించారు.
రూ.113కోట్ల హెరాయిన్ సీజ్.. ముగ్గురు అరెస్టు..
Heroin Seized: కోల్‌కతా విమానాశ్రయంలో 16.5 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాని విలువ అంతర్జాతీయ మర్కెట్లో రూ.113 కోట్లు ఉంటుందని తెలిపారు.
హెరాయిన్
వారికి సంబంధించిన వస్తువులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ పౌడర్‌ను వారి బ్యాగుల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల్లో ఆ పౌడర్ హెరాయిన్‌గా గుర్తించారు. నిందితులు ఆయా దేశాల నుంచి దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి భారత్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. ముగ్గుర్ని అరెస్టు చేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:బైక్ ర్యాలీపై రాళ్ల దాడి.. 35 మందికి గాయాలు.. కర్ఫ్యూ విధింపు