Heroin Seized: మాదక ద్రవ్యాలను లోదుస్తుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఉగాండ దేశస్థుడిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. రూ.7 కోట్ల విలువ గల ఒక కేజీ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
విమానాశ్రయంలో షార్జా నుంచి వస్తున్న ప్రయాణికుడ్ని (29) ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతని లోదుస్తుల్లో 108 హెరాయిన్ క్యాప్సూల్స్‌ను గుర్తించారు. మొత్తం హెరాయిన్ ఒక కేజీ బరువు ఉందని తెలిపారు.