తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీగ లాగితే కదిలిన డొంక.. రూ.1300 కోట్ల విలువైన డ్రగ్స్​​​ సీజ్​ - మత్తు పదార్థాలు

Heroin seized in UP: ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో భారీగా హెరాయిన్​ పట్టుకున్నారు అధికారులు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లు సుమారు రూ.1300 కోట్లుగా ఉంటుందని తెలిపారు. మూడు రోజుల క్రితం దిల్లీలో పట్టుబడిన మత్తుపదార్థాల కేసు విచారణంలో.. యూపీ విషయం బయటపడినట్లు చెప్పారు.

Heroin seized in UP
రూ.1300 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్​

By

Published : May 1, 2022, 7:27 PM IST

Heroin seized in UP: మాదకద్రవ్యాల ముఠాపై గుజరాత్​ ఏటీఎస్​ ఉక్కుపాదం మోపుతోంది. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను పట్టుకుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు తాజాగా ఓ నిందితుడిని విచారించగా.. భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉత్తర్​ప్రదేశ్​, ముజఫర్​నగర్​ జిల్లా మొహళ్ల కిద్వాయినగర్​ ప్రాంతంలో గుజరాత్​ ఏటీఎస్​ తనిఖీలు చేపట్టింది. సుమారు రూ.1300 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టుకుంది.

ఇదీ జరిగింది:మూడు రోజుల క్రితం దిల్లీ షాహీన్​బాగ్​లో అఫ్గానిస్థాన్​ నుంచి నగరానికి వచ్చిన 97 కిలోల హెరాయిన్​ సహా రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది ఎన్​సీబీ. ఈ కేసులో ఖైరానాకు చెందిన అహ్మద్​, ఇద్దరు అఫ్గానిస్థానీలను అరెస్ట్​ చేసింది. అహ్మద్​ను విచారించగా.. ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​కు చెందిన హైదర్​ పేరు బయటకు వచ్చింది. దీంతో హైదర్​ను అదుపులోకి తీసుకుని విచారించాయి ఎన్​సీబీ, గుజరాత్​ ఏటీఎస్​. ఈ క్రమంలో ముజఫర్​నగర్​లోని తన ఇంటిలో డ్రగ్స్​ దాచినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు కిద్వాయి నగర్​కు ఓ టీమ్​ వెళ్లి అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. భారీగా డ్రగ్స్​ బయటపడ్డాయి. హైదర్​తో పాటు ఇమ్రాన్​ అనే వ్యక్తి ఈ కేసులో ఉన్నట్లు తెలిసింది.

హైదర్​ అలియాస్​ చున్ను 30 ఏళ్ల క్రితం పెయింటర్​గా పని చేసేవాడు. 20 ఏళ్ల క్రితం దిల్లీకి వెళ్లి ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఆ తర్వాత షాహీన్​బాగ్​లో నివాసం ఉంటున్నాడు. మాదకద్రవ్యాలు విక్రయిస్తూ కొన్నేళ్లలోనే మిలియనీర్​గా అవతరించాడు. కిద్వాయి నగర్​లో విలాసవంతమైన ఓ ఇంటిని నిర్మించాడు. ఇటీవల గుజరాత్​ తీరంలో పట్టుకున్న డ్రగ్స్​ కేసులోనూ హైదర్​ పేరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:రూ.1439 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

భారత్​లో పట్టుబడే డ్రగ్స్​ వెనుక ఉగ్రవాదం ఉందా?

ABOUT THE AUTHOR

...view details