Heroin Seized In Punjab:పంజాబ్ ఫిరోజ్‌పుర్ సెక్టార్లో వేర్వేరు ఘటనల్లో 40.64 కేజీల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి సరిహద్దు భద్రతా దళాలు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా 28 ప్యాకెట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు!.
ఓ ఘటనలో బట్టలో చుట్టిన 34.34 కేజీల డ్రగ్స్‌ను గుర్తించాయి భద్రతా దళాలు. మరో ఘటనలో 6.30 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మత్తుపదార్థాలను హెరాయిన్‌గా అనుమానిస్తున్నారు.
పంజాబ్‌లో డ్రగ్స్ సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాపై నిఘా పెంచాయి బలగాలు.