తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NTR centenary celebrations : 'ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాల్సిందే' - NTR centenary celebrations in Hyderabad

NTR centenary celebrations on Balakrishna: ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, అభిమానుల తరపున డిమాండ్ చేస్తున్నానని నటుడు బాలకృష్ణ స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

BALA KRISHNA
BALA KRISHNA

By

Published : May 8, 2023, 5:58 PM IST

Updated : May 8, 2023, 6:45 PM IST

NTR centenary celebrations on Balakrishna: ఎన్టీఆర్​ శతజయతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని మాసబ్​ట్యాంక్​లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్​ శతజయంతి ఉత్సవాలకు నటుడు నందమూరి బాలకృష్ణ మఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్​ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉందని పేర్కొన్నారు.

సామాన్యుల కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికంగా విడిపోయినా ఏపీ, తెలంగాణ ప్రజలు అన్నదమ్ములుగా కలిసే ఉండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

NTR centenary celebrations in Hyderabad: ఎన్టీఆర్‌ పేరు చెప్పగానే ప్రతి తెలుగు వ్యక్తి గుండె పొగరుతో నినదిస్తోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సామాన్యుల కోసం ఎన్టీఆర్​ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఎందరో రాజకీయనేతలకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు. మన దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. మండల వ్యవస్థ, మహిళ యూనివర్శిటీ, వెనుక బడిన సామాజిక వర్గాలు వారికి రిజర్వేషన్లు పెంచారని తెలిపారు. ఇలా ఎన్టీఆర్​ తీసుకొచ్చిన పథకాలు, హైదరాబాద్​లో ఆయన హాయంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాల్సిందే..! నందమూరి తారక రామారావుకు 'భారత రత్న' ఇవ్వాలని నందమూరి కుటుంబం, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల తరఫున డిమాండ్​ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, నందమూరి సుహాసినీ, సాయిబాబా, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

"దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. మండల వ్యవస్థను తీసుకొచ్చారు. వెనుక బడిన సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు పెంచారు. మహిళ యూనివర్శిటీ, హెల్త్ యూనివర్శటీలు తీసుకొచ్చారు. ఎన్నో చారిత్రత్మక పథకాలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తికి మా కుటుంబం, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు, టీడీపీ పార్టీ తరుపున డిమాండ్​ చేస్తున్నా.. ఎన్టీఆర్​కు భారత్న రత్న ఇవ్వాలి".- బాలకృష్ణ, సినిమా నటుడు

హైదరాబాద్​లో ఎన్టీఆర్​ శతజయంతి వేడుకల్లో బాలకృష్ణ

ఇవీ చదవండి:

Chandrababu: ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు.. శక్తి: చంద్రబాబు

Super Star Rajini: విజయవాడలో సూపర్​స్టార్​ రజనీ, నటసింహం బాలయ్య.. ఫొటోలను మీరు చూసేయండి

బాలయ్య నయా లుక్​.. వారితో స్పెషల్​ డిన్నర్​.. ఫుల్​ ఖుషీ!

Last Updated : May 8, 2023, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details