గణతంత్ర వేడుకులకు దిల్లీ రాజ్‌పథ్‌లో 32 శకటాలు ప్రదర్శనకు రానున్నాయి. ఇందులో 17.. రాష్ట్రాలకు చెందినవి కాగా మిగిలిన 15.. మంత్రులు, ప్రభుత్వ విభాగాలకు చెందినవి ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు తమ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా శకటాలను తీర్చిదిద్దనున్నాయి.
లద్దాఖ్ నుంచి తొలిసారిగా..
ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. కరోనాకు సంబంధించిన శకటం కూడా ఇందులో ఉండనుంది. కొత్తగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ నుంచి తొలిసారిగా ఓ శకటం ప్రదర్శనకు రానుంది.
ఏ రాష్ట్రం నుంచి ఏ శకటం
- గుజరాత్ - మోడెరా సూర్యదేవాలయం
- ఆంధ్రప్రదేశ్ - లేపాక్షి ఆర్ట్
- అసోం - టీ
- తమిళనాడు - పల్లవ రాజవంశం
- మహారాష్ట్ర - భక్తి ఉద్యమం
- ఉత్తరాఖండ్ - కేదర్నాథ్
- ఛత్తీస్‌గఢ్ - జానపద సంగీతం
- పంజాబ్ - గురు తేగ్ బహుదూర్(తొమ్మిదో సిక్కు గురువు)
- త్రిపుర - ఆత్మనిర్భర్ భారత్
- బంగాల్ - సబుజ్ సాథీ(రాష్ట్ర ప్రభుత్వ పథకం)
- ఉత్తర్‌ప్రదేశ్ - అయోధ్య
- దిల్లీ - షాజహానాబాద్, చాందినీ చౌక్
- కర్ణాటక - విజయనగర సామ్రాజ్యం
- కేరళ - కొబ్బరికాయలు
కరోనా కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు తక్కువ మంది సైనికులతోనే కవాతు నిర్వహించాలని, ప్రేక్షకులనూ పరిమిత సంఖ్యలోనే అనుమతించాని కేంద్రం నిర్ణయించింది.
ఇదీ చూడండి:బైడెన్‌పై ప్రేమతో మైనపు విగ్రహం