ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద భద్రత వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు.. ముంబయి పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌ను బదిలీ చేసింది. హోం గార్డ్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా నియమించింది.
ముంబయి సీపీ పరమ్‌బీర్ సింగ్ బదిలీ - పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌ను
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌ను బదిలీ చేసింది. పరమ్‌బీర్ సింగ్ స్థానంలో హేమంత్ నగ్రాలేను నియమించింది.
ముంబయి సీపీ పరమ్‌బీర్ సింగ్ బదిలీ
పరమ్‌బీర్ సింగ్ స్థానంలో ముంబయి పోలీసు కమిషనర్‌గా హేమంత్ నగ్రాలేను నియమిస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.
ఇదీ చూడండి:పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజేనే: ఎన్ఐఏ