తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎలక్ట్రిక్ హెల్మెట్.. బైక్ చోరీ అవ్వదు.. పెట్టుకోకుంటే బండి కదలదు!

రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు బిహార్​కు చెందిన ఓ ఇంజనీరింగ్​ విద్యార్థి విన్నూత్నంగా ఆలోచించాడు. బైక్ యాక్సిడెంట్లను నివారించడమే కాకుండా, వాహనం చోరీకి గురికాకుండా చేసే పరికరాన్ని రూపొందించాడు.

By

Published : Nov 12, 2022, 9:28 PM IST

Helmet Will Prevent Road Accident
Helmet Will Prevent Road Accident

దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది మరణిస్తుంటారు. అందులో దాదాపు బైక్​ యాక్సిడెంట్లలో మృతిచెందే వారే అధికంగా ఉంటున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చాలా వరకు బైక్​ ప్రమాదాలకు హెల్మెట్ పెట్టుకోకపోవడం ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని జరగకూడదని అనుకున్న బిహార్​ నలందాలోని ఓ ఇంజనీరింగ్​ యువకుడు.. బైక్ యాక్సిడెంట్లను నియంత్రించేందుకు విన్నూత్నంగా ఆలోచించాడు. ప్రమాదాలను నివారించడంలో తోడ్పడే ఎలక్ట్రిక్ హెల్మెట్​ను రూపొందించాడు.

ఇంజనీరింగ్​ విద్యార్థి కనిపెట్టిన డివైజ్​

ఎలా పనిచేస్తుందంటే?
హెల్మెట్​కు వాహనానికి మధ్య ఓ కనెక్షన్​ ఏర్పాటు చేసినట్లు విద్యార్థి తెలిపాడు. సెన్సార్ల ఆధారంగా ఆ డివైజ్​ వర్క్​ అవుతుందని చెప్పాడు. దీని వల్ల బైక్​ నడిపేవారు ఈ హెల్మెట్ వేసుకోకపోతే బైక్ స్టార్ట్ అవ్వదు. అంతే కాకుండా బైక్​పై ముగ్గురు కూర్చొని వెళ్లినా.. పరికరం హెచ్చరిస్తుంది. వాహనదారుడిని అలర్ట్​ చేసి ఆటోమేటిక్‌గా బైక్ ఆగిపోతుంది. రెడ్ సిగ్నల్ దాటకుండా కూడా ఇది నిరోధిస్తుంది. రెడ్ సిగ్నల్‌ను దాటేందుకు ప్రయత్నిస్తే బైక్​ ముందుకు వెళ్లదు. ఎవరైనా బైక్​ను నకిలీ కీతో ప్రారంభించాలని అనుకున్నా.. బైక్ స్టార్ట్ అవ్వదు. ఈ ఫీచర్ వల్ల బైక్ చోరీకి గురికాకుండా ఉంటుందని యువకుడు చెబుతున్నాడు.

అవగాహన కార్యక్రమంలో పోలీసులు

సురక్షితమేనా?
ఈ ఎలక్ట్రానిక్​ డివైజ్​ను పరిచయం చేస్తూ ప్రజలకు దీని వల్ల ఉన్న అవసరాలపై అవగాహన కల్పించేందుకు నలంద ట్రాఫిక్​ పోలీసులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ డివైజ్​ ఎలా పని చేస్తుందన్న విషయాన్ని డెమో చూపించాడు విద్యార్థి. దాదాపు విజయవంతమైన ఈ హెల్మెట్​ మార్కెట్లోకి రావాలంటే ఏడాది నుంచి రెండేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త రకం హెల్మెట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు డెమోలు కూడా ఇప్పిస్తున్నామని... దీన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రజల నుంచి సూచనలు తీసుకుంటున్నట్లు నలంద డీఎస్పీ తెలిపారు. హెల్మెట్​కు తుది మెరుగులు దిద్దాక అందుబాటు​ ధరకే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:హిమగిరిలో జోరుగా పోలింగ్ బారులు తీరిన ఓటర్లు

ప్రారంభించిన రోజే నీటిలో మునిగిపోయిన రేసింగ్ బోటు

ABOUT THE AUTHOR

...view details