Helicopters తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో హెలికాప్టర్లు.. ఆరా తీస్తున్న అధికారులు - తితిదే లేటెస్ట్ న్యూస్
17:16 April 25
నో ఫ్లయింగ్ జోన్‌లో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై భక్తుల విస్మయం
Helicopters Hovered Around Tirumala Srivari Temple: తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో హెలికాప్టర్లు సంచారంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం మూడు హెలికాప్టర్లు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి బిల్డింగ్, బాలాజీనగర్ ఉపరితలంపై ఎగురుతూ కనిపించాయి. ఇలా.. నో ఫ్లయింగ్ జోన్‌లో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై భక్తులతో పాటు టీటీడీ అధికారులు విస్మయం చెందారు. కాగా హెలికాప్టర్ల సంచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి: