Helicopter saved from crash: కేధార్నాథ్ యాత్రలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. పైలట్ చాకచాక్యంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ల్యాండ్ చేశాడు. హెలికాప్టర్ దిగిన చోటుకు అత్యంత దగ్గర్లోనే వందల మంది యాత్రికులు ఉన్నారు. హెలికాప్టర్ అదుపు తప్పడం చూసి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. చివరకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం మే 31 న జరగగా.. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి.
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్, విమానం.. లక్కీగా వందల మంది.. - కేధార్నాథ్లో హెలికాప్టర్ ల్యాండింగ్
Helicopter saved from crash: ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. పైలట్ చాకచాక్యంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ల్యాండ్ చేశాడు. ఈ ఘటన కేధార్నాథ్ యాత్రలో జరిగింది. మరో ఘటనలో ఒడిశాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి.
ఒడిశా డెంకనాల్ సమీపంలోని బిరసల్ ఎయిర్ స్ట్రిప్ వద్ద ఓ విమానం అదుపు తప్పి కూలింది. జీఏటీఐ అనే ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందిన సెస్నా 152 విమానం కూలినట్లు ఏవియేషన్ నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వీటీ-ఈయూడబ్యూ నంబరు గల విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం ముందు భాగం ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి:Live Video: వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. లక్కీగా ఆ ఇద్దరు...