తెలంగాణ

telangana

కేదర్​నాథ్​లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి

By

Published : Oct 18, 2022, 12:25 PM IST

Updated : Oct 18, 2022, 5:39 PM IST

केदारनाथ के पास बांसबाड़ा में हेलीकॉप्टर क्रैस होने की खबर. रुद्रप्रयाग DIP एसपी बोले खबर मिली है. पूरी जानकारी का इंतजार है. एसडीआरएफ और एनडीआरएफ मौके के लिए रवाना.

Helicopter crash kedarnath
Helicopter crash kedarnath

12:21 October 18

కేదర్​నాథ్​లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి

హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో దృశ్యాలు

ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. కేదర్​నాథ్​లో యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం.. సహాయక చర్యలు చేపట్టింది. "కేదర్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి యాత్రికులతో ప్రయాణిస్తున్న.. ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన బెల్ 407 వీటీ-ఆర్​పీఎన్​ హెలికాప్టర్​కు దారి కనిపించక కొండను ఢీకొని కుప్పకూలింది. వెంటనే దానిలో మంటలు చెలరేగాయి" అని అధికారులు తెలిపారు.

గరుడ్​ చట్టి అటవీ ప్రాంతంలోని దేవ్​ దర్శిని వద్ద మంగళవారం ఉదయం 11.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని.. రుద్రప్రయాగ్​ జిల్లా విపత్తుల నిర్వహణాధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ విపత్తు నిర్వహణా దళం, దిల్లీ, ఉత్తరాఖండ్​కు చెందిన విపత్తు నిర్వహణా దళాలు, పోలీసులు కలిసి మృతదేహాలను హెలికాప్టర్​లో కేదర్​నాథ్​కు తరలించారు. మృతులు గుజరాత్‌కు చెందిన పూర్వ రామానుజ్ (26), కృతి బ్రార్ (30), ఊర్వి బ్రార్ (25).. తమిళనాడుకు చెందిన సుజాత (56)​, కళా (60), ప్రేమ్ కుమార్​లతో పాటు.. మహారాష్ట్రకు చెందిన పైలట్ అనిల్ సింగ్ (57)లుగా గుర్తించినట్లు రుద్రప్రయాగ్​ జిల్లా విపత్త నిర్వహణ అధికారి తెలిపారు.

ప్రముఖుల సంతాపం ..
'కేదర్‌నాథ్​లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్‌తో సహా పలువురు యాత్రికులు మరణించారనే వార్త విన్నాక చాలా బాధ కలిగింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హిందీలో ట్వీట్ చేశారు.
'ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా సానుభూతి' అని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.
'మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ నష్టాన్ని భరించే శక్తిని దేవుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి మేము రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని' అని కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా రెండు ట్వీట్​లు చేశారు.

Last Updated : Oct 18, 2022, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details