Sonic Boom: బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ శబ్ధం - సోనిక్ బూమ్

14:00 July 02
Sonic Boom: బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ శబ్ధం
కర్ణాటక బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారీ శబ్ధాలు(Sonic boom) వినిపించాయి. భారీ శబ్ధంతో భయాందోళనకు గురైన బెంగళూరు వాసులు పరుగులు తీశారు. శబ్ధం ధాటికి పలు నివాసాల్లో కిటికీలు కొట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. శబ్ధానికి కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
మరోవైపు.. హాల్ ఎయిర్పోర్ట్ నుంచి రోజూ మాదిరిగానే ఫైటర్ జెట్స్, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు బయలుదేరినట్లు చెప్పారు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రతినిధి గోపాల్ సుతార్. బెంగళూరు నగరంలో శుక్రవారం మధ్యాహ్నం వినిపించిన భారీ శబ్ధంపై ఎలాంటి విషయాలు వెల్లడించలేమని పేర్కొన్నారు.