ఉత్తరాఖండ్ బద్రినాథ్ ఆలయం, పరిసర ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఇళ్లు, వాహనాలను పూర్తిగా మంచు కప్పేసింది. ఎడతెరిపి లేని హిమపాతానికి రహదారి వెంట ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అటు హిమాచల్‌లోని లాహౌల్-స్పిటి జిల్లాలోని ప్రాంతాల్ని మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం కారణంగా ఆ ప్రాంతం స్వర్గధామంలా కనిపిస్తోంది.
బద్రినాథ్ ఆలయాన్ని కప్పేసిన మంచు - హిమపాతం
ఉత్తరాఖండ్ బద్రినాథ్ దేవాలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఆలయం పరిసర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పిటి జిల్లాలోనూ మంచువర్షం కురుసింది. హిమపాతం కారణంగా హిమాచల్ ప్రాంతంలో ఎటు చూసినా శ్వేతవర్ణంతో స్వర్గధామంలా కనువిందు చేస్తోంది.
బద్రినాథ్ ఆలయాన్ని కప్పేసిన మంచు వర్షం
మంచు వర్షానికి ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్ పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి :గర్ల్‌ఫ్రెండ్ అమ్మమ్మను చంపి మైనర్ ఆత్మహత్య