రానున్న రెండు రోజుల్లో(14, 15) కేరళలో కుండపోత వర్షపాతం కురవనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(ఎస్డీఎంఏ) 'రెడ్ అలర్ట్'ను జారీ చేసింది. దీని ప్రభావంతో తిరువనంతపురం, కొల్లం, పతనంథిట్ట, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలు సహా.. కేరళలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఎస్డీఎంఏ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రజలంతా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అరేబియా సముద్రంలో లక్షద్వీప్ ప్రాంతంలో శుక్రవారం అల్పపీడనంగా మొదలై.. శనివారం ఉదయం నాటికి తీవ్రరూపు దాలుస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మే 18 సాయంత్రానికి గుజరాత్లో తీరం దాటుతుందని అంచనా వేసింది.