జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మరణించారు. మంగళవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విరిగిపడిన కొండచరియలు
వర్షాల ధాటికి హిమాచల్‌ప్రదేశ్ కంగ్రా జిల్లాలో బోహ్ లోయలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మంది గల్లంతయ్యారు. కాగా పలు ప్రాంతాల్లో 20 మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోహ్ లోయలో 100మందికి పైగా బాధితులను కాపాడారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కశ్మీర్లో భారీ ట్రాఫిక్