తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ వర్షాలకు కేరళ గజగజ- ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్​ - కేరళ న్యూస్ టుడే

శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళలోని పలు ప్రాంతాలు(kerala heavy rain) చిగురుటాకులా వణుకుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది(kerala rains ). కొన్నిజిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు.

Heavy rains lash Kerala
ఏకధాటి వర్షాలతో చిగురుటాకులా వణుకుతున్న కేరళ

By

Published : Nov 14, 2021, 8:05 PM IST

కేరళలో భారీ వర్షాలు

ఏకధాటి వర్షాలకు కేరళ తడిసిముద్దవుతోంది(kerala heavy rain ). శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి(kerala rains ). పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. దక్షిణ కేరళలోని పలు చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైలు పట్టాలపై పడటంతో సర్వీసులకు అంతరాయం కల్గింది. రాబోయే 24 గంటల్లో మధ్య కేరళ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎర్నాకులం జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

నవంబర్ 16 వరకు కేరళలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది(kerala heavy rain news). ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది(kerala rains today). పథనంతిట్ట, కొల్లాం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గరిష్ఠస్థాయిని చేరుకోవడంతో ఇడుక్కిలోని చెరుతోని డ్యాం గేట్లు ఎత్తాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ముల్లపెరియార్‌ జలాశయం నిండుకుండలా మారిందని ఇడుక్కి జిల్లా యంత్రాంగం తెలిపింది. వచ్చే 24 గంటల్లో జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున సమీప ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచన..

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ సూచించారు(kerala latest news). కొండచరియలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఫేస్​బుక్​ పోస్టు ద్వారా తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు ఆహార, నివాస ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వర్షాల దృష్ట్యా మూడు నాలుగు రోజుల పాటు శబరిమల ఆలయానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని కలెక్టర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:తాత్కాలికంగా నిలిచిపోనున్న రైల్వే రిజర్వేషన్లు!

ABOUT THE AUTHOR

...view details