బిహార్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. తూర్పు చంపారన్, ముజఫర్‌పూర్ జిల్లాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రికిరాత్రి ఇళ్లలోకి పెద్దఎత్తున వరద నీరు చేరగా, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండగా, పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. కొంత మంది మహిళలు చంటిబిడ్డలను తీసుకొని వరదనీటిలో ప్రమాదకరంగానే ప్రయాణిస్తున్నారు.
తూర్పు చంపారన్ జిల్లా బగహ ప్రాంతంలో రహదారులపై మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండగా ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.