నైరతి రుతుపవనాలు తిరోగమనం దిశగా పయనిస్తున్న క్రమంలో రానున్న 6-7 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
అతి భారీ వర్షాలు..
ఉత్తర భారత్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. పశ్చిమ హిమాలయాలు, ఉత్తర్ ప్రదేశ్లో జులై 17 నుంచి 20 వరకు అతి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. జులై 18 నుంచి 20 వరకు పంజాబ్, హరియాణా, తూర్పు రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.