తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weather today: కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం

దేశంలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8:30 గంటల వరకు దిల్లీలోని సఫ్దార్​జంగ్​ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబయి సహా పలు ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

heavy rainfall in delhi
కుండపోత వర్షం

By

Published : Aug 21, 2021, 11:42 AM IST

Updated : Aug 21, 2021, 1:58 PM IST

దిల్లీలో వర్షాలు

దిల్లీలో భారీవర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో దిల్లీలో ఆరెంజ్​​ అలర్ట్​ హెచ్చరిక జారీ చేశారు అధికారులు. శనివారం ఉదయానికి సఫ్దార్​జంగ్​ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఇంకా కొనసాగుతాయన్నారు అధికారులు.

వర్షనీటిలోనే ప్రయాణం
భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం
రహదారులపైకి భారీగా వర్షపు నీరు
నీటిలో మునిగిన అండర్​పాస్
రోడ్లన్నీ జలమయం

భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోగా వాహనదారులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్‌పాస్‌ రోడ్లలో భారీగా నీరు చేరటం వల్ల ఆ మార్గాల్లో రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

రోడ్లపైకి వచ్చిన నీరు
నీటిని మోటార్లతో లాగేస్తూ..
రోడ్లపై నిలిచిన వాహనాలు
భారీగా చేరిన వర్షం నీరు
భారీగా చేరిన నీరు
నదిని తలపిస్తున్న అండర్​పాస్
వాన నీటిలో..
రోడ్డు దాటేందుకు..

మూల్‌చంద్‌, ఆజాద్‌ మార్కెట్‌, అండర్‌పాస్‌లను తాత్కాలికంగా మూసివేశారు. నోయిడా, ఆజాద్ పుర్ ప్రాంతాల్లో భారీగా వరదనీరు రోడ్లపై ప్రవహిస్తోంది. నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అటు ముంబయిలోనూ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరింది.

ఇదీ చదవండి:కంపించిన భూమి- పరుగులు తీసిన జనం!

Last Updated : Aug 21, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details