తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ల్యాబ్​లోకి వరద నీరు.. శాస్త్రవేత్తల కష్టం నీటి పాలు!

కర్ణాటక బెంగళూరులో కురిసిన భారీ వర్షాలు(Bangalore flood).. శాస్త్రవేత్తలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. జేఎన్​సీఏఎస్​ఆర్​ ల్యాబ్​లోకి వరద నీరు(Jncasr flooding) ముంచుకు రాగా.. ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ వస్తున్న జన్యు నమూనాలు, కీలక పరిశోధన పత్రాలు, విలువైన పరికరాలు నాశనమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా జేఎన్​సీఎస్​ఆర్​కు వచ్చి, పరిస్థితిని పరిశీలించారు.

JNCASR floods
ల్యాబ్​లోకి వరద నీరు

By

Published : Nov 23, 2021, 7:53 PM IST

ల్యాబ్​లోకి వరద నీరు

శాస్త్రవేత్తల కష్టం వరద పాలైంది! ఎన్నో ఏళ్లుగా అధ్యయనం చేస్తూ వచ్చిన వారి కృషి నీటిలో కలిసిపోయింది. కర్ణాటక బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Karnataka rains) కారణంగా.. అక్కడి జవహార్ లాల్​ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్​డ్​ సైంటిఫిక్ రిసెర్చ్​లోకి​(జేఎన్​సీఏఎస్​ఆర్​)(Jncasr flooding) వరద నీరు భారీగా ప్రవేశించింది. దీంతో తీరని నష్టం ఏర్పడింది.

జల దిగ్బంధంలో జేఎన్​సీఏఎస్​ఆర్
ఇన్​స్టిట్యూట్​లో చేరిన వర్షం నీళ్లు
నీట మునిగిన పరికరాలు

శాస్త్రవేత్తల విచారం..

ఉత్తర బెంగళూరులోని జక్కూర్ ప్రాంతంలో ఉండే.. ఈ మల్టీ డిసిప్లినరీ రిసెర్చ్ ఇన్​స్టిట్యూట్​లోని ప్రయోగశాలలోకి వర్షాల ధాటికి వరద నీరు(Floods into lab) ముంచుకొచ్చింది. దీంతో దాదాపు 25 ఏళ్లుగా కాపాడుతూ వస్తున్న కొన్ని జన్యునమూనాలు నాశనమయ్యాయి. పరిశోధన పత్రాలు, లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలు ధ్వంసమయ్యాయి. తమ కృషి ఇలా నీటిపాలవ్వడం చూసి... అక్కడి శాస్త్రవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

జేఎన్​సీఏఎస్​ఆర్​ను చుట్టుముట్టిన వరద
జేఎన్​సీఏఎస్​ఆర్ ప్రాంగణంలో వరద

జేఎన్​సీఏఎస్​ఆర్ 1989లో భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా భారతరత్న, ప్రొఫెసర్ సీఎన్​ఆర్ రావు ప్రారంభించారు. భారత శాస్త్ర, సాంకేతిక శాఖ ఈ ఇన్​స్టిట్యూట్​ను ఏర్పాటు చేసింది.

ఇప్పుడు బెంగళూరులో కురిసిన భారీ వర్షాల ధాటికి వరద నీటిలో చిక్కుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం జేఎన్​సీఏఎస్​ఆర్​కు వచ్చి, పరిస్థితిని​ పరిశీలించారు.

జేఎన్​సీఏఎస్​ఆర్​లో పర్యటిస్తున్న సీఎం బసవరాజ్ బొమ్మై
పరిస్థితిని పరిశీలిస్తున్న సీఎం
సీఎంకు వరద పరిస్థితిని వివరిస్తున్న అధికారులు
జేఎన్​సీఏఎస్​ఆర్​లో సీఎం

ఇదీ చూడండి:కర్ణాటకలో పోటెత్తిన వరద- క్షేత్రస్థాయిలో సీఎం పర్యటన

ఇదీ చూడండి:Tamilnadu rain: మరో 4 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details