ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలోని దేవప్రయాగ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అకాల వర్షాలకు శాంతానది ఉప్పొంగింది. వరదల ధాటికి రెండు మున్సిపల్ భవనాలతో పాటు కొన్ని దుకాణాలు నేలమట్టమయ్యాయి. పాదాచారుల బ్రిడ్జ్‌లు ధ్వంసం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మున్సిపల్ కమిషనర్ కేకే కోటియాల్ తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు... అమిత్ షా ఆరా - ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల కారణంగా శాంతానది ఉప్పొంగింది. భారీ వరదల ధాటికి పలు భవనాలు, దుకాణాలు నీటమునిగాయి. ఆకస్మిక వరదలపై సీఎం తీరథ్ సింగ్ రావత్‌తో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు
ఆకస్మిక వరదలపై ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్‌తో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం